‘ఇంతకంటే ఆదిపురుష్ బెటర్!’ మెగాస్టార్ ‘విశ్వంభర’ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

by karthikeya |
‘ఇంతకంటే ఆదిపురుష్ బెటర్!’ మెగాస్టార్ ‘విశ్వంభర’ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర టీజర్ ఈ రోజు (శనివారం) ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిమానులకు దసరా పండుగ కానుకగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న విశ్వంభర(Vishwambhara) చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. 1.33 నిమిషాల పాటు కొనసాగే ఈ టీజర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది.

అయితే ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. టీజర్లో విజువల్స్ రియలిస్టిక్‌గా లేవని, ముఖ్యంగా కొన్ని సీర్స్ అవెంజర్స్ సినిమా నుంచి కాపీ కొట్టినట్లు కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమందైతే దీనికంటే ఆదిపురుష్ బెటర్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. అయితే చిరంజీవి లుక్ మాత్రం సూపర్‌గా ఉందని, విజువల్స్‌లో ఉన్న మిస్టేక్స్ సరి చేసుకుంటే సినిమా సూపర్ హిట్ పక్కా అని అభిప్రాయపడుతున్నారు.



Advertisement

Next Story