- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాది పవిత్రమైన బంధం.. అపవిత్రమైంది కాదు: దివ్వెల మాధురి
దిశ, వెబ్ డెస్క్: తమది పవిత్రమైన బంధమని, అపవిత్రమైంది కాదని దివ్వెల మాధురి అన్నారు. తిరుమలలో రీల్స్ చేశారని కేసు నమోదు కావడంపై ఆమె స్పందించారు. స్నేహితురాలిగా దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రోటోకాల్ ప్రకారమే తిరుమలకు వెళ్లానని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేదని, ఇప్పుడే ఇంత చర్చ లేపారని మాధురి తెలిపారు. స్వామి వారి నామస్మరణతో మాడవీధుల్లో ప్రదిక్షణలు మాత్రమే చేశానని మాధురి స్పష్టం చేశారు.
‘‘మొన్నటి వరకూ తిరుమల లడ్డూపై ప్రచారం చేశారు. ఇప్పుడు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమల కొండపై నేను రీల్స్ చేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. రీల్స్ చేస్తే 7న ఎందుకు కేసు పెట్టలేదు. 10వ తారీకు వరకూ ఎందుకు ఆగారు. పవన్‌పై నేను చేసిన వ్యాఖ్యల వల్లే నాపై కేసులు పెట్టారు. మీడియా వాళ్లను మేం పిలువలేదు. పవిత్రమైన స్థలంలో ఎంత పవిత్రంగా ఉండాలనేది మాకు తెలుసు. దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమలకు చాలాసార్లు వెళ్లాం. శ్రీనివాస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక నీచమైన ప్రచారాలు చేస్తున్నారు. నాపై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయపరంగా ఎదుర్కొంటాం.’’ అని దివ్వెల మాధురి తెలిపారు.