Engineer Rashid : ‘ఉగ్ర’ నిధుల కేసు.. ఆ ఎంపీ బెయిల్ గడువు పొడిగింపు

by Hajipasha |
Engineer Rashid : ‘ఉగ్ర’ నిధుల కేసు.. ఆ ఎంపీ బెయిల్ గడువు పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో కశ్మీరులోని బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ మధ్యంతర బెయిల్ గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. ఈమేరకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు 2017 సంవత్సరంలో ఉగ్రవాదులకు నిధులను సమకూర్చారనే అభియోగంతో రషీద్‌పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు.. 2022లో ఆయనకు జీవితఖైదు శిక్షను విధించింది.

దీంతో నాటి నుంచి ఇంజినీర్ రషీద్ ఢిల్లీలోని తిహార్ జైలులోనే ఉన్నారు. జైలులో ఉండగానే గత లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలిచారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేందుకు రషీద్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. అయితే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీకి కొన్ని రోజుల ముందే రషీద్‌కు మధ్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ గడువు శనివారంతో ముగియనుండగా.. ఇప్పుడు మరో మూడు రోజులు పొడిగించారు.

Advertisement

Next Story

Most Viewed