తిరుమల బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ శ్యామలరావు కీలక వ్యాఖ్యలు

by srinivas |
తిరుమల బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ శ్యామలరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భక్తులకు సేవ చేయడమంటే.. భగవంతుడికి చేయడమేనని టీటీడీ చైర్మన్ శ్యామలరావు(TTD Chairman Shyama Rao) అన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో(Tirumala Brahmotsavam) భక్తులకు అందించిన సేవలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, జిల్లా యంత్రాంగం మొత్తం సమన్వయంతో పని చేశాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై అధికారులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నామని శ్యామలరావు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే వాహనాల రద్దీని తగ్గించామని చెప్పారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఈసారి 26 లక్షల మంది భక్తులకు ప్రసాదం వితరణ చేశామని తెలిపారు. మజ్జిగ, పాలు, కాఫీ, బాదం మిల్క్‌తో పాటు 4 లక్షల మంచినీళ్ల బాటిళ్లు అందజేశామన్నారు. గరుడ వాహన సేవలో 3.5 మంది భక్తులు పాల్గొన్నారని టీటీడీ చైర్మన్ శ్యామలారావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed