Foot problems: పాదాలే మీ ఆరోగ్యాన్ని చెబుతాయి!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-22 05:56:57.0  )
Foot problems: పాదాలే మీ ఆరోగ్యాన్ని చెబుతాయి!
X

దిశ,ఫీచర్స్: శరీరంలో ప్రతిరోజూ అనేక మార్పులు జరుగుతుంటాయి. బాడీ లోపల ఏం జరుగుతుందో అంత తేలికగా మనకు తెలియదు. కానీ, కొన్ని సందర్భాల్లో చర్మంపై, బాహ్య అవయవాలపై కనిపించే లక్షణాల కారణంగా, శరీరం లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుస్తుంది. ముఖ్యంగా మన చర్మం, పాదాలలో అనేక మార్పులు వచ్చిన్పపుడు వాటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* పాదాల కింద భాగం అకస్మాత్తుగా ఉబ్బిన్నట్లైతే, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా అకస్మాత్తుగా పాదాలు వాచినట్లైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన గుండె నొప్పి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు తరచుగా పాదాలు వాపు వస్తాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ల విలువల్లో తేడాలు వచ్చినప్పుడు కాళ్లు వాచే అవకాశం ఉంటుంది.

* ఎలాంటి శ్రమ చేయకుండా మడమలు పగుళ్లు ఏర్పడితే, విటమిన్ బి3, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉండవచ్చు. దీనికి పోషకాలు ఉన్న పదార్థాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

* పాదాలు తరచుగా జలదరిస్తున్నట్లు లేదా సూదులు గుచ్చుతున్నట్లు అనిపిస్తే, విటమిన్ బి12 లోపంకు కారణం కావొచ్చు. ఈ సమస్య ఉన్నవారు ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ లోపంను తగ్గించుకోవాలంటే ప్రతి రోజూ గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో విటమిన్- బి12 పుష్కలంగా ఉంటుంది.

* శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల గౌట్ వ్యాధి వచ్చే చాన్స్ ఉంది. ఇది పాదాల్లో ఎక్కువ మంటను కలిగిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.

* తరచుగా కాళ్లలో తిమ్మిరి వస్తున్నటైతే శరీరంలో మెగ్నీషియం లోపం ఉందని అర్థం. మెగ్నీషియం లోపం వల్ల కాళ్లలో తిమ్మిరి ఏర్పడుతుంది. డీహైడ్రేషన్, శరీరంలో ఎలక్ట్రోలైట్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం అల్లం టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అల్లంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మధుమేహం సమస్యలు ఉన్నవారికి ఈ సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది.

ఇవి మాత్రమే కాకుండా.. శరీరంలో ఎక్కడైనా గాయం తగిలి మానకపోయినా, అది తగ్గడానికి ఎక్కువ సమయం పట్టినా.. మధుమేహానికి సంకేతం కావొచ్చు. పాదాల్లో రక్తప్రసరణ సరిగా లేకపోతే, పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. రక్తంలో అయోడిన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story