Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!!

by Anjali |   ( Updated:2024-11-23 07:48:48.0  )
Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ నంద్యాల(Arjun Nandyala) దర్శకత్వం వహించిన ‘దేవకీ నందన వాసుదేవ’(Devaki Nandana Vasudeva) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటించాడు. నల్లపనేని యామిని సమర్పణ(Nallapaneni Yamini offering)లో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌(Lalithambika Productions banner)పై సోమినేని బాలకృష్ణ(Somineni Balakrishna) (ఎన్‌ఆర్‌ఐ) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్‌గా నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ఇకపోతే నిన్న (నవంబరు 22) ఈ చిత్ర హీరో అశోక్ గల్లా(Ashok Galla) మీడియా వారితో ముచ్చటించాడు. ‘‘ఈ మూవీ మామ మహేష్ బాబు నటించిన మురారి సినిమాను గుర్తు చేసిందని అన్నాడు. కానీ ఈ కథకు.. ఈ చిత్రానికి పోలికుండదని తెలిపాడు. బోయపాటి శ్రీను(Boyapati Srinu), ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఆ విధంగా ఉంటుందని అన్నాడు. డైరెక్టర్ అర్జున్ నంద్యాల ఈ చిత్రాన్ని చాలా గొప్పగా ఎలివేట్ చేసి ప్రేక్షకులకు చూపించారని పేర్కొన్నాడు.

ప్రేక్షకులకు కచ్చితంగా దేవకీ నందన వాసుదేవ సినిమా నచ్చుతుందని అన్నాడు. మూవీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నామని, సినిమాలోని ప్రతి సన్నివేశం భిన్నంగా చూపించారని తెలిపాడు. అలాగే ఈ మూవీలో తన పాత్ర పేరు కృష్ణ(Krishna) అని.. కథానాయిక పేరు సత్యభామ(Satya Bhama) అని వివరించాడు. విలన్‌గా కంసరాజు(King Kamsa) నటించారని తెలిపాడు. కానీ ఈ మూవీ కోసం భారీ వర్కౌట్స్ చేశానని.. సినిమాకు తగ్గ లుక్స్ కోసం తెగ కష్టపడ్డానని మీడియా వారితో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడి ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story