Adani Group: అదానీ లంచం ఆరోపణలపై వైట్ హౌజ్ ఏమందంటే?

by Shamantha N |
Adani Group: అదానీ లంచం ఆరోపణలపై వైట్ హౌజ్ ఏమందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ(Gautam Adani) పై లంచం, మోసం ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైంది. కాగా.. దీనిపై వైట్ హౌజ్ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది. వైట్ (White House) మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారం గురించి స్పందించారు. ‘‘అదానీపై కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదు. భారత్‌-అమెరికా (India - US) మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకుంటున్నాం. మిగతా సమస్యలలానే ఈ సంక్షోభాన్ని కూడా ఇరుదేశాలు అధిగమించగలవు. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతంగానే ఉంది’’ అని కరీన్‌ చెప్పుకొచ్చారు.

సెకీతో ఒప్పందాలు

ఇక, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌తో(SECI) ఒప్పందాలు చేసుకునేందుకు భారత్‌లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని అదానీపై Bribe Allegations on Adani) ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బు కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ (Gautam Adani)పై నమోదైంది. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీతోపాటు సాగర్‌ అదానీ, వినీత్‌ ఎస్‌.జైన్, అజూర్‌ పవర్‌ సీఈఓ రంజిత్‌ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (FCPA) కింద వీరికి సహకరించిన మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్‌ అదానీతోపాటు సాగర్‌ అదానీపైనా బుధవారం అమెరికాలో అరెస్ట్‌ వారంట్లు జారీ అయినట్లు తెలుస్తోంది. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నతస్థాయి’ వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed