- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శోభిత- నాగచైతన్య పెళ్లిపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. కేవలం వారి సమక్షంలోనే అంటూ
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మ్యారేజ్ అయిన 4 ఏళ్లకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని దూరం అయ్యారు. ఇక అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్ని పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా మీడియాకు చిక్కాయి. ఇక వీటన్నిటిని నిజం చేస్తూ రీసెంట్‌గా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైంలో శోభిత ధూళిపాళ పసుపు దంచుట కార్యక్రమం అంటూ మ్యారేజ్‌పై హింట్ ఇచ్చేసింది. కాగా చైతన్య, శోభితలు డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీరి పెళ్లిపై నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా నాగార్జున.. నాగ చైతన్య- శోభిత ధూళిపాళ వివాహంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘చైతన్య, శోభితల పెళ్లి చాలా సింపుల్‌గా జరుగుతుంది. వీరి వివాహం డిసెంబర్ 4న హైదారాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేవలం 300- 400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితుల సమక్షంలో జరుగుతుంది. అయితే వీరిద్దరూ సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతో ఏర్పాట్లను కూడా వాళ్ళకే వదిలేశాను’ అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.