High Court TG: బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక తీర్పు

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-22 05:49:54.0  )
High Court TG: బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని.. ఆ అర్హత స్పీకర్‌(Speaker)కు ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కాగా, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed