వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా ఆయుధ పూజ..

by Sumithra |   ( Updated:2024-10-12 12:04:17.0  )
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా ఆయుధ పూజ..
X

దిశ, హనుమకొండ : విజయదశమి పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అతిధిగా హాజరయి ఐదు భాండాగారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుర్గామాతకు తో పాటు ఆయుధాలకు పూజలు నిర్వహించారు.

అనంతరం కార్యాలయం ఆవరణలోని శమీ వృక్షానికి పూజలు చేశారు. అధికారులు, సిబ్బందికి శమీపత్రాలను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చివరగా పోలీస్ కమిషనర్ య.టి విభాగంలో పోలీస్ కమిషనర్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రవీందర్, అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్, అనంతయ్య, సురేంద్ర, ఆర్. ఐలు స్పర్జన్ రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్. ఎస్. ఐ శ్రవణ్ తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed