'స్పిన్నర్‌లా బౌలింగ్ చేసే పేసర్ వాడు'.. ఇంగ్లండ్ పేసర్‌పై ఆసీస్ మాజీ లెజెండ్‌ ఫైర్..

by Vinod kumar |
స్పిన్నర్‌లా బౌలింగ్ చేసే పేసర్ వాడు.. ఇంగ్లండ్ పేసర్‌పై ఆసీస్ మాజీ లెజెండ్‌ ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఎప్పుడూ ఎక్కువగా ఆసీస్ జట్టు ఎగ్రెసివ్‌గా ఉంటే.. ఇంగ్లండ్ కొంత వెనుకంజలో ఉంటుంది. కానీ ఈసారి ఆ రోల్స్ రివర్స్ అయ్యాయి. ఇంగ్లండ్ ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయింది. ఓడిపోయినా ఎనర్జీ లెవెల్స్ చూపించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ తన ఎగ్రెషన్ చూపించాడు. ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా భారీ సెంచరీతో చెలరేగాడు. 141 పరుగులు చేసిన అతన్ని ఔట్ చేయడానికి ఇంగ్లండ్ కొత్త స్ట్రాటజీతో ఇబ్బంది పెట్టింది. ఈ సమయంలో బంతి అందుకున్న రాబిన్సన్ సూపర్ యార్కర్‌తో ఖవాజాను పెవిలియన్ చేర్చాడు. ఔట్ అవగానే ఖవాజా వైపు సీరియస్‌గా చూస్తూ సెండాఫ్ ఇచ్చాడు. దీంతో రాబిన్సన్ చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై మాజీ ఆసీస్ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపించారు.

ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీతో ఆసీస్ మాజీ లెజెండ్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ రాబిన్సన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఇక ఆ రెండో వాడు.. అసలు గుర్తే ఉండని ప్లేయర్. ఫాస్ట్ బౌలర్ అయ్యుండీ.. 124 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ నోరు మాత్రం చాలా పెద్దది' అన్నాడు హేడెన్. అతని మాటలు అర్థం కాని హేలీ.. 'ఎవరు ఓలీ రాబిన్సనా?' అని అడిగాడు. అలాంటి వాడి దగ్గరకు డైరెక్ట్‌గా వెళ్లి.. బ్రదర్, నేను నిన్ను వదిలిపెట్టను చూస్కో అని చెప్పేయాలి' అని హేడెన్ అన్నాడు. తాజాగా రికీ పాంటింగ్ కూడా రాబిన్సన్‌పై విమర్శలు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed