వైస్ కెప్టెన్ ప‌ద‌వి అనవ‌స‌రం.. ర‌విశాస్త్రి ఆసక్తికర కామెంట్స్‌

by Vinod kumar |   ( Updated:2023-02-26 10:33:17.0  )
వైస్ కెప్టెన్ ప‌ద‌వి అనవ‌స‌రం.. ర‌విశాస్త్రి ఆసక్తికర కామెంట్స్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతోన్న టీమిండియా ఓపెన‌ర్ కెఎల్ రాహుల్‌‌పై టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. బోర్డర్ గ‌వాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన గ‌త‌ రెండు టెస్ట్‌ల్లో రాహుల్ కేవ‌లం 38 ప‌రుగులు మాత్రమే చేయడంతో చాలా విమ‌ర్శలు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లు టెస్ట్‌ల‌తో పాటు వ‌న్డేల్లో వైస్ కెప్టెన్‌గా కొన‌సాగిన కెఎల్ రాహుల్‌‌ను మిగ‌తా రెండు టెస్ట్‌ల‌కు వైస్ కెప్టెన్ ప‌ద‌వి నుంచి త‌ప్పించిన టీమ్ మేనేజ్‌మెంట్ కేవ‌లం ఓపెన‌ర్‌గానే ఆడించాల‌ని నిర్ణయించుకున్నది. ఈ నేప‌థ్యంలో ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. స్వదేశంలో జ‌రిగే సిరీస్‌ల‌లో వైస్ కెప్టెన్‌గా ఎవ‌రిని నియ‌మించ‌క‌పోవ‌డ‌మే మంచిదంటూ పేర్కొన్నారు.

కొన్నిసార్లు వైస్ కెప్టెన్ అనే ట్యాగ్ వ‌ల్లే ప్లేయ‌ర్స్‌ జ‌ట్టులో కొన‌సాగించాల్సివ‌స్తుంటుంద‌ని, ఆ ట్యాగ్ లేక‌పోతే అత‌డి స్థానంలో ఎవ‌రినైనా ఆడించ‌డం సుల‌భ‌మ‌వుతుంద‌ని అన్నాడు ర‌విశాస్త్రి. వైస్ కెప్టెన్ లాంటి ప‌ద‌వుల కంటే ఆట‌గాళ్ల ఫామ్ ముఖ్యమ‌ని ర‌విశాస్త్రి చెప్పాడు. అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోన్న ఎంతో మంది ప్రతిభ‌వంతులైన ఆట‌గాళ్లు ఇండియాలో ఉన్నారు. అలాంట‌ప్పుడు ఫామ్‌లో లేని ఆట‌గాడి కంటే గిల్ లాంటి ప్రత్యామ్నాయ ప్లేయ‌ర్స్ పై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టిపెడితే మంచిద‌ని ర‌విశాస్త్రి పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed