ఒకే ఓవర్‌లో 43 రన్స్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

by Hajipasha |
ఒకే ఓవర్‌లో 43 రన్స్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
X

దిశ, స్పోర్ట్స్ : సాధారణంగా ఒక ఓవర్‌లో బ్యాటర్ 30కు పైగా పరుగులు రాబట్టడం టీ20 ఫార్మాట్లో కామన్ అయిపోయింది.కానీ, ఒక ఓవర్లో బౌలర్ 43 పరుగులు సమర్పించుకోవడం ప్రపంచ క్రికెట్ హిస్టరీలో ఇదే తొలిసారి.ప్రస్తుతం టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుండగా.. ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ టోర్నీలో ఈ వరల్డ్ రికార్డ్ నమోదైంది. లీసెస్టర్ షైర్, సస్సెక్స్‌ల మధ్య జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్.. సస్సెక్స్ టీం తరఫున 59వ ఓవర్ వేయడానికి వచ్చాడు.

ప్రత్యర్థి టీం బ్యాటర్ కింబర్ లూయిస్.. ఓలీ బ్యాటింగులో సిక్సుల వర్షం కురిపించాడు.దీంతో బౌలర్ బంతిపై నియంత్రణ కోల్పోయి ఏకంగా 3 నోబాల్స్ విసిరాడు. దీంతో బ్యాటర్ మొత్తం 2 సిక్సులు, 6 ఫోర్లుతో చెలరేగిపోయాడు. అయితే, ఈసీబీ డొమిస్టిక్ ఛాంపియన్ షిప్‌లో నోబాల్‌కు రెండు పరుగులు అదనంగా వస్తాయి. దీంతో ఓలీ వేసిన బౌలింగ్‌లో 6,6nb,4,6,4,6nb,4,6nb,1 గణాంకాలు ఇలా ఉన్నాయి. ఇదిలాఉండగా, కౌంటీ ఛాంపియన్ షిప్ 134 ఏళ్ల చరిత్రలో ఒకే ఓవర్లో ఇన్ని పరుగులు బాదడం ఇదే తొలిసారి.

Next Story

Most Viewed