పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. 40 మంది ప్లేయర్లకు పాజిటివ్

by Mahesh |
పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం.. 40 మంది ప్లేయర్లకు పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా పాజిటీవ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వివిధ ఈవెంట్ లో పాల్గొనేందుకు పారిస్ వచ్చిన ప్లేయర్లు అస్వస్థతకు గురికావడంతో అథ్లెట్లకు కోవిడ్ -19 టెస్టులు చేశారు. ఈ టెస్టులో 40 మందికి పైగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా అంతా షాక్ అవ్వడంతో గందరగోళానికి గురయ్యారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా గుర్తించింది. కోవిడ్ -19 మహమ్మారి వెనుక ఉన్న వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతోందని, దేశాలు తమ ప్రతిస్పందన వ్యవస్థలను పదును పెట్టాల్సిన అవసరం ఉందని WHO తెలిపింది.

పారిస్ గేమ్స్‌లో అనేక మంది ఉన్నత స్థాయి అథ్లెట్లు కోవిడ్-19 బారిన పడినట్లు గుర్తు చేశారు. వీరిలో బ్రిటీష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజతం గెలిచిన ఒక రోజు తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనికి కోవిడ్-19 పరిక్ష చేయగా.. పాజిటివ్ గా తెలినట్లు ప్రకటించారు. అలాగే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆస్ట్రేలియా పతక ఆశలు కలిగిన లాని పల్లీస్టర్ అనారోగ్యంతో నిష్క్రమించింది. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే వైరస్ - SARS-CoV-2 కోసం పాజిటివ్ పరీక్షల శాతం "చాలా వారాలుగా పెరుగుతోందని WHO డైరెక్టర్ వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

Advertisement

Next Story