- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెక్స్ కోరికలు తీర్చాలని మహిళా యాంకర్‌కు వేధింపులు
దిశ, వెబ్‌డెస్క్ : అమ్మాయిల అందచందాలను చూసి ఆ ఆకర్షణతో ప్రేమ, పెళ్లి అంటూ వారి వెంట పడి వేధిస్తున్నారు కొందరు యువకులు. ఆడవాళ్లు ఏ రంగంలో ఉన్నా ఈ వేధింపులు తప్పడం లేదు. పోలీస్, న్యాయ, మీడియా, రాజకీయ ఇలా ప్రముఖ విభాగాల్లో ఉన్న మహిళలకూ పోకిరీలా బెడద తప్పడం లేదు. తాజాగా ఓ తెలుగు టీవీ యాంకర్‌ను యువకుడు వేధించిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న ఓ తెలుగు టీవీ చానల్‌లో యాంకర్‌గా పని చేస్తోంది ఓ యువతి. పెళ్లి కాని ఆమె.. మధురానగర్‌లో హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు కూకట్ పల్లికి చెందిన సామ్రాట్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని వెంట తిరిగేవాడు. ఈ సమయంలో యువతికి తెలియకుండా ఆమె ప్రైవేట్ ఫొటోలు తీశాడు. ఇటీవల ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ యువతిపై అత్యాచారం చేయబోయాడు. భయపడిపోయిన యాంకర్.. సామ్రాట్ చర నుంచి తప్పించుకుని పారిపోయింది. అయినా ఆమె వెంట పడుతూ తనతో సెక్స్‌లో పాల్గొనాలని లేకపోతే నీ న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన యాంకర్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెతోనే సామ్రాట్‌ను రప్పించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ హైదరాబాద్ మీడియా రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.
Read more:
- Tags
- Crime News