- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్గో కొరియర్ సేవలకు విశేష స్పందన
దిశ, పటాన్ చెరు: బీహెచ్ఈఎల్ డిపో ఆర్టీసీ కార్లో, పార్సెల్, సేవలకు సంవత్సరం పూర్తి కావడం జరిగిందని బెల్ డిపో మేనేజర్ ఈ.వి సత్యనారాయణ తెలిపారు. కొరియర్ సేవలు గత సంవత్సరం 19 జూన్ 2020 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్భంగా 16 వేల పార్సల్స్ కేవలం సర్వీసు బస్సుల ద్వారా చేరవేసి అందరికీ 18 లక్షలు ఆపై కార్గో బస్సుల ద్వారా 10 లక్షలు అంటే మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు సంపాదించడమైనది తెలిపారు. ఇంత ఆదాయం పొందడానికి కృషిచేసిన కార్గో పార్సెల్ సిబ్బందిని, ఉద్యోగులను అభినందించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు పరిధిలోని బీరంగూడ, ఆర్సీపురం, చందానగర్, కిష్టారెడ్డి పేట, పాశమైలారం, ఇస్నాపూర్, బీడీఎల్ శంకర్ పల్లి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పట్టణాల నుండి విశేష స్పందన వచ్చి అధిక లాభాలు ఆర్జించడం జరిగిందని అన్నారు. ప్రైవేటు కొరియర్ సర్వీస్ ఎన్ని ఉన్నప్పటికీ ఆర్టీసీ కార్గో కొరియర్ సర్వీస్ లో పనితీరు నమ్మదగినదిగా ఉండడం వలన ప్రజలందరూ ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నందున ఊహించినదానికంటే ఎక్కువ పార్సల్స్ చేరవేయడం అయిందని తెలిపారు. రేపటి నుండి లాక్ డౌన్ ఎత్తివేస్తుండటం వలన ఈ సేవలు మరింత విస్తృతం పరచనున్నామని చెప్పారు. డిపోలో ఉన్న 5 పెద్ద కార్గో బస్సులను పూర్తి స్థాయిలో వినియోగిస్తామన్నారు.
వేగంగా, భద్రంగా, మరింత చేరువగా సేవలు అందిస్తూ ఉండడంతో ఇతర ట్రాన్స్ పోర్టుల కంటే తక్కువ ధర ఉండడంతో టిఎస్ ఆర్టీసి కార్గో పార్సెల్స్ ను వినియోగదారులు సరైనదిగా ఎంచుకుంటున్నారని తెలిపారు. కాలానుగుణంగా ప్రజల అవసరాలను కార్గో సేవలు తీరుస్తున్నాయి. వేసవికాలంలో కూలర్స్, పండ్లను, వర్షాకాలంలో విత్తనాలు, వరినారు, మెడిసిన్స్ వివిధ కంపెనీలకు సంబందించిన ముడి సరుకులను బస్సుల ద్వారా సమీప దూర ప్రాంతాలకు కొన్ని గంటల వ్యవధిలో పంపడంవలన, అన్ని రకాల వినియోగదారులనుండి విశేష స్పందన వస్తుందని పేర్కొన్నారు. కార్గో పార్సెల్ సేవలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.