- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరు పర్యాటకం వీక్షించేందుకు ప్రత్యేక బస్సు.. ధర ఎంతంటే..?
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “పాలమూరు పర్యాటకం” సందర్శన కోసం ప్రత్యేక బస్సును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపొందించామన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నో చారిత్రక, పురాతన, ప్రకృతి సహజంగా ఏర్పడిన ప్రదేశాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. దేశంలోనే రెండవ అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ ఉందన్నారు. వీటితోపాటు సుమారు 700 ఏండ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి చెట్టు ఉందన్నారు. అంతేకాకుండా పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కలుపుతూ ‘మహబూబ్ నగర్ టూరిజం సర్క్యూట్’ ఏర్పాటు చేశామన్నారు. వీటిని సందర్శించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యాటకులకు నామమాత్ర రుసుము కింద పెద్దలకు 300 రూపాయలు, పిల్లలకు 200 వందల రూపాయలతో మూడు యాత్రలలో పాల్గొనేలా ప్యాకేజీని రూపొందించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టూరిజం సర్క్యూట్‌లలో పర్యాటకులు ప్రయాణించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బస్ సౌకర్యాన్ని దశల వారీగా కల్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ S. వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్‌లు శ్రీనివాస్ రెడ్డి, రాంలక్ష్మణ్, గోవింద్, జావీద్ బైగ్, చెరుకుపల్లి రాజేశ్వర్, సుదీప్ రెడ్డిలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.