- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో.. ఇండస్ట్రియల్ పార్క్స్!
దిశ, ఫీచర్స్ : సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రకు కూడా ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఈ మేరకు రాబోయే కొన్ని సంవత్సరాల్లో స్పేస్ టూర్స్ మొదలయ్యే అవకాశం ఉండగా.. జాబిల్లిపై ఇప్పటికే స్థలాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమ్మీద సకల సౌకర్యాలు ఏర్పరచుకున్న మానవుడు అంతరిక్షానికి వెళితే ఎలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ భయాలేం అక్కర్లేదు. ఎందుకంటే ఔత్సాహికులు అందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘వార్ద స్పేస్ ఇండస్ట్రీస్’ రోదసిలో ఫ్యాక్టరీలు నిర్మిస్తామంటూ ముందుకొచ్చింది.
2023లోగా అంతరిక్షంలో తొలి ఇండస్ట్రీ స్థాపించేందుకు ‘వార్ద’ ప్లాన్ చేస్తోంది. మొత్తంగా ఓ కక్ష్యలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలనుకున్న వారి లక్ష్యం కోసం తొలిగా 42 మిలియన్ల ఫండింగ్ సంపాదించారు. వచ్చే రెండేళ్లలో ‘వార్ద స్పేస్ షిప్’ ద్వారా దాదాపు 100 కిలోల మెటీరియల్‌ను రోదసిలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. వార్ద ఆలోచన జెఫ్ బెజోస్ ఆలోచన కంటే భిన్నమైనది.
కాగా, ఈ నెల ప్రారంభంలో తన అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్న బెజోస్.. ‘అన్ని భారీ పరిశ్రమలు, కాలుష్య కారక పరిశ్రమలను భూమి నుంచి తరలించాలని’ కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. అయితే కక్ష్యలో సిమెంట్ మిక్సర్లు, స్టీల్ ప్లాంట్లు ఉండవు కనుక వాటికి బదులుగా బయోప్రింటెడ్ ఆర్గాన్స్, ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ లేదా ఫార్మాస్యూటికల్స్‌ను అక్కడికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు భూమిపై సాధ్యం కాని తయారీ ప్రక్రియలతో నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు.
అంతరిక్షంలో నావల్ మెటీరియల్స్, ప్రొడక్ట్స్ సాధ్యమవుతాయని గత కొన్ని దశాబ్దాలుగా ఐఎస్ఎస్ పరిశోధనల్లో తేలింది. ‘ప్రభుత్వ రంగంలో ఆర్అండ్‌డీ చేశాం. మేము ఇప్పటికే నిరూపించిన ఆ పరిశోధన కోసం వాణిజ్యీకరణ వైపు దూసుకుపోతున్నాం. ప్రస్తుతం మా కంపెనీ అంతరిక్ష నౌకను మూడు-మాడ్యూల్స్‌లో తయారుచేస్తోంది. ఆఫ్-ది-షెల్ఫ్ శాటిలైట్ ప్లాట్‌ఫామ్, మైక్రోగ్రావిటీ తయారీ జరిగే సెంటర్ ప్లాట్‌ఫామ్‌తో పాటు పదార్థాలను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు రీఎంట్రీ వాహనాన్ని నిర్మిస్తోంది. అంతరిక్షంలో ఉత్పత్తులను నిర్మించాలనుకునే ఇతర సంస్థలకు కాంట్రాక్ట్ తయారీ వేదికగా మారడమే దీర్ఘకాలిక లక్ష్యం. ఇక నిర్మాణమంతా ఆటోమేటెడ్ పద్ధతిలోనే చేపట్టాలనుకుంటున్నాం’ అని వార్ద సంస్థ సీఈవో విల్ బ్రూ పేర్కొన్నాడు.