దాతల సహాయం వెలకట్టలేనిది: ఎస్పీ శశిధర్ రాజు

by Aamani |
దాతల సహాయం వెలకట్టలేనిది: ఎస్పీ శశిధర్ రాజు
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్‎డౌన్‎కు సహకరిస్తున్న ప్రజలకు అండగా నిలుస్తున్న దాతల సహాయం వెలకట్టలేనిదని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలో ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగుల సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో.. బంగల్‎పేట్ మహాలక్ష్మి కాలనీ వాసులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ వారికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నారని గుర్తు చేశారు. లాక్‎డౌన్ సమయంలో వలస కూలీలు, నిరుపేదలకు అండగా నిలుస్తున్న వారిని ఎస్పీ అభినందించారు. అలాగే, కరోనా తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జాన్ దివాకర్, ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story