పదవీ విరమణ పొందిన పోలీసులకు ఎస్పీ సత్కారం

by Shyam |
పదవీ విరమణ పొందిన పోలీసులకు ఎస్పీ సత్కారం
X

దిశ, నల్గొండ: పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు సమజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పిలుపునిచ్చారు. గురువారం పదవీ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐ ఎస్.వెంకట్రాజు, ఏఎస్ఐ ఎస్.లచ్చిరెడ్డిలను జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో పూలమాలలతో సత్కరించారు. పోలీసు శాఖకు వారందించిన సేవలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అధికారుల సేవలు ఎంతో స్ఫూర్తివంతమని చెప్పారు. సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా సేవలందించే అవకాశం పోలీస్ ఉద్యోగం ద్వారా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సి.నర్మద తదితరులు పాల్గొన్నారు.

Tags: SP Ranganath, honored, retired policemen, nalgonda

Advertisement

Next Story