ఎస్పీ లీడర్ ఆజంఖాన్ ఆరోగ్యం విషమం.. ఆక్సిజన్ సపోర్టుపై చికిత్స

by Shamantha N |   ( Updated:2021-05-29 08:02:54.0  )
ఎస్పీ లీడర్ ఆజంఖాన్ ఆరోగ్యం విషమం.. ఆక్సిజన్ సపోర్టుపై చికిత్స
X

లక్నో: కరోనా మహమ్మారి బారిన పడ్డ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ ఆరోగ్యం విషమంగా ఉన్నది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆక్సిజన్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆరోగ్య విషమంగా ఉందని చికిత్సనందిస్తున్న మేదాంత హాస్పిటల్ వెల్లడించింది. భూ ఆక్రమణ, ఇతర నేరాల్లో ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఖాన్‌లు సీతాపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిరువురికి కరోనా పాజిటివ్ అని తేలగానే మే 9న సీతాపూర్ జైలు నుంచి మేదాంత హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

Next Story