వృద్ధిరేటు 9 శాతానికి కుదింపు : ఎస్అండ్‌పీ

by Harish |   ( Updated:2020-09-14 05:23:14.0  )
వృద్ధిరేటు 9 శాతానికి కుదింపు : ఎస్అండ్‌పీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 9 శాతం క్షీణిస్తుందని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ వెల్లడించింది. ఇది గతంలో అంచనా వేసిన 5 శాతం కంటే ఎక్కువని, దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తాము వృద్ధి అంచనాను మరింత ప్రతికూలంగా సవరించినట్టు కంపెనీ ప్రకటించింది. వినియోగదారుల వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా కుప్పకూలాయని, అందుకే ఇదివరకే భారత ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా అంచనా వేసిన రేటింగ్ ఏజెన్సీల బాటలోనే ఎస్ అండ్ పీ కూడా వృద్ధి అంచనాలను మార్చినట్టు తెలుస్తోంది.

‘జూన్ నెలలో దేశీయంగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలపై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వినియోగదారులు మరింత జాగ్రత్త వహిస్తూ, వ్యయాన్ని తగ్గిస్తున్నారు. అదేవిధంగా సంస్థలు కరోనా ప్రభావంతో ఒత్తిడికి లోనవుతున్నాయి’ అని ఎస్అండ్‌పీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగష్టు రిటైల్ ద్రవ్యోల్బణ డేటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీడియం టర్మ్ టార్గెట్ పరిధిలోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది. భారత అధిక లోటు ఆర్థిక ఉద్దీపన అవకాశాలను మరింత పరిమితం చేస్తుందని ఎస్అండ్‌పీ అభిప్రాయపడింది. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని ఎస్అండ్‌పీ అంచనా వేసింది.

Read Also..

‘రత్నాలు, ఆభరణాల వ్యాపారం కోలుకుంటోంది’

Advertisement

Next Story

Most Viewed