డబ్బింగ్ ఆర్టిస్టుగా గాత్రదానం..!

by Shyam |   ( Updated:2023-09-27 12:35:41.0  )
డబ్బింగ్ ఆర్టిస్టుగా గాత్రదానం..!
X

దిశ, వెబ్‎డెస్క్: గొంతు ద్వారా అనేక అద్భుతాలు సృష్టించే ఎస్పీ బాలుకు ఎంతో మంది నటులకు డబ్బింగ్ చెప్పే అవకాశాలు వచ్చాయి. ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ తమిళ అనువాద చిత్రం ‘మన్మథలీల’లో హీరో కమల్ హాసన్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చారు. తమిళంలో హిట్ అయిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతూ ఉండే కమల్ హాసన్ నటించిన అన్ని చిత్రాలకూ ఎస్పీ బాలునే డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత రజనీకాంత్, భాగ్యరాజ్, జెమినీ గణేశన్, అర్జున్, గిరీష్ కర్నాడ్, రఘువరన్, నగేష్, కార్తీక్, సల్మాన్ ఖాన్, మోహన్, విష్ణువర్ధన్ తదితర ఎంతో మందికి డబ్బింగ్ చెప్పారు.

నటుల హావభావాలు, శైలికి అనుగుణంగా మాత్రమే కాక వ్యక్తులకు తగినట్లుగా గొంతులు మార్చడంలో కూడా బాలుకు ప్రత్యేకత ఉంది. ఒకే నటుడికి పలు రకాల వేషాలకు తగినట్లుగా కూడా గొంతును మార్చి డబ్బింగ్ చెప్పే వినూత్న ప్రక్రియకు బాలు శ్రీకారం చుట్టారు. కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రంలో పది పాత్రల్లో ఏడు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ‘అన్నమయ్య’లో వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన్ సుమన్, ‘సాయి మహిమ’లో డబ్బింగ్ చెప్పినందుకు ‘ఉత్తమ డబ్బింగ్ కళాకారుడి’గా ‘నంది’ పురస్కారం లభించింది.

Advertisement

Next Story