ఎస్పీ బాలుకు మళ్లీ తీవ్ర అస్వస్థత

by Anukaran |   ( Updated:2020-09-24 07:09:45.0  )
ఎస్పీ బాలుకు మళ్లీ తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా పాజిటివ్‌ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు 40రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఇటీవలే కొద్దిగా కోలుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ గురువారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలు త్వరగా కోలుకోని ఇంటికి రావాలని కొద్దిరోజులుగా సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు, ప్రజలు దేవాలయాల్లో పూజలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story