- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్..
దిశ, డైనమిక్ బ్యూరో: కోవిడ్ కారణంగా భారీ నష్టాలను చవిచూసిన రైల్వే శాఖ ప్రత్యామ్నాయ ఆదాయం వైపు మొగ్గు చూపింది. ఈ సందర్భంగా.. సరుకు రవాణా చేసేందుకు స్పెషల్ ట్రైన్ లు నడిపి ఆదాయంలో రికార్డు సృష్టించింది. పార్సిల్ రవాణాలో దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. జోన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటి 6 నెలల్లో రూ.109.3 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. గత ఏడాది ఇదే టైంలో రూ.108.3 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు.
రైల్వే శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు 343 కిసాన్ రైళ్లను నడిపి, 1,08,388 టన్నుల సరుకులు రవాణా చేయడం ద్వారా రూ.49.43 కోట్ల ఆదాయం రాగా, దూద్ దురంతో స్పెషల్ ట్రైన్స్ ద్వారా 3.78 కోట్ల లీటర్ల పాలను ట్రాన్స్‌పోర్ట్ చేయడంతో రూ.17.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు రైల్వేశాఖ తెలిపింది. వీటితో పాటు చేపలు, కోడిగుడ్లు తదితరాలను కూడా రవాణా చేసి రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టింది. దీంతో అధికారులను, స్టాఫ్‌ను జీఎం గజానన్ మాల్య అభినందించారు.