- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జియా ఖాన్ వల్లే నా కెరియర్ నాశనమైంది : యంగ్ హీరో
దిశ, సినిమా : యాక్ట్రెస్ జియా ఖాన్ కేసులో నిందితుడైన సూరజ్ పంచోలీ .. నిజంగా తాను తప్పు చేస్తే శిక్షించబడతానని, నిర్దోషిగా తేలితే ఈ కేసు నుంచి విముక్తిపొందేందుకు అర్హుడనని అభిప్రాయపడ్డాడు. 2013లో ముంబైలోని సూరజ్ అపార్ట్మెంట్లో తన గర్ల్ ఫ్రెండ్ జియా నిర్జీవంగా కనిపించింది. అయితే తను ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలగా.. సూరజ్ తన కూతురిని మర్డర్ చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది జియా తల్లి రబియా.
దాదాపు 8 ఏళ్లుగా దీనిపై విచారణ జరుగుతుండగా.. ఈ మధ్య కేసును స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో తాను కొంత సంతృప్తి చెందినట్లు తెలిపాడు సూరజ్. త్వరలో కేసు క్లోజ్ అవుతుందనే ఆశతో ఉన్నానన్న ఆయన.. ఈ ఎనిమిదేళ్లు తనకు అంత సులభం కాదని, సినిమా పరిశ్రమలో తన ఇమేజ్ పూర్తిగా నాశనం అయిందని చెప్పాడు. ప్రతీ ఒక్కరూ తనను చూసిన విధానం భరించలేకపోయాని, ఈ పీరియడ్లో ఎదుర్కొన్న సవాళ్లను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనన్నాడు.