- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూ.. ‘నా భర్తతో ఉండలేను.. పుట్టింటికి పంపించండి’
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు సాయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఓ వైపు ప్రశంసల జల్లు కురుస్తుండగా.. మరోవైపు వేలల్లో రిక్వెస్ట్‌లు అందుతున్నాయి. స్వస్థలాలకు చేరవేయాలని కోరుతున్న వారికి సోనూ.. కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం వింత కోరికలు కోరుతున్నారు. అయినా వాటన్నింటికీ ఆయన ఓపిగ్గా సమాధానం ఇస్తుండటం విశేషం. ఈ క్రమంలో ఇటీవలే ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలని సోనూసూద్‌ను కోరిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి తనని ఇంటి నుంచి వైన్ షాపుకు తరలించాలని కోరగా, దానికి సోనూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. తాజాగా ఓ మహిళ.. ‘నేను నా భర్తతో ఉండలేకపోతున్నా.. నన్ను అమ్మగారింటికి పంపాలని’ కోరింది.
‘జనతా కర్ఫ్యూ నుంచి నేను నా భర్తతోనే కలిసి ఉంటున్నాను. ప్రస్తుతం నేను అతనితో ఉండలేకపోతున్నాను, నన్ను నా తల్లిగారి ఇంటికి పంపుతారా..!’ అని ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను కోరింది. దీనికి సోనూ ఆసక్తికరంగా స్పందించారు. ‘నా దగ్గర ఓ బెటర్ ప్లాన్ ఉంది. మీ ఇద్దరిని గోవాకు పంపుతాను.. ఏమంటారు’ అని నవ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశారు. కాగా సోనూ చేసిన ట్వీట్‌కు నెటిజన్స్ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు.
I have a better plan .. let me send both of you to Goa😂 What say? https://t.co/XbYNFWWflK
— sonu sood (@SonuSood) May 31, 2020