మిహికా రానాకు బెస్ట్ ఫ్రెండ్ సోనమ్ లవ్‌లీ విష్

by Jakkula Samataha |
మిహికా రానాకు బెస్ట్ ఫ్రెండ్ సోనమ్ లవ్‌లీ విష్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మంగళవారం తనకు కాబోయే భార్య మిహికా బజాజ్‌ను ఇంట్రడ్యూస్ చేసిన రానా.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే తను ఎస్ చెప్పిందని..’ తనతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి రాణాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పటి వరకు రానా ఫ్రెండ్స్ మాత్రమే సోషల్ మీడియాలో విష్ చేయగా.. ఫస్ట్ టైమ్ మిహికా సైడ్ నుంచి ఓ బెస్ట్ అండ్ లవ్లీ విష్ వచ్చింది.

అది కూడా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నుంచి. సోనమ్, మిహికా బెస్ట్ ఫ్రెండ్స్ కాగా.. రానా మిహికాతో లవ్ గురించి రీవీల్ చేయగానే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘కంగ్రాట్స్ మై డార్లింగ్ బేబీ.. మిహికా ఐ లవ్ యూ డాల్’ అంటూ శుభాకాంక్షలు తెలిపింది. రానా నిన్ను అపురూపంగా చూసుకుంటాడని నాకు తెలుసు.. నువ్వు ఆ ప్రేమకు అర్హురాలివి అంటూ స్టేటస్ పెట్టింది సోనమ్. మన కుటుంబంలోకి స్వాగతం రానా అంటూ వెల్ కమ్ చెప్పింది. ఇక సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కూడా రానాకు విష్ చేశాడు. హైదరాబాద్ కొడుకుకు శుభాకాంక్షలు.. లవ్ యూ మై సన్.. ఈ వార్తతో చాలా ఆనందంగా ఉన్నా.. జీవితంలో మీరిద్దరూ మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story