దారుణం: ఆ పని చేయలేదని కన్నతల్లిని గొంతు నొక్కి చంపిన కొడుకు

by Aamani |   ( Updated:2021-08-02 10:26:21.0  )
దారుణం: ఆ పని చేయలేదని కన్నతల్లిని గొంతు నొక్కి చంపిన కొడుకు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లిని భూమి కోసం ఒక కొడుకు కిరాతకంగా గొంతు నొక్కి చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శేట్ పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వరిగోంతం ఎల్లవ్వ(48) కు రాజు అనే కొడుకు ఉన్నాడు. ఆమెకు వ్యవసాయ భూమే ఆధారం. గత కొన్ని రోజులుగా ఆ భూమి తన పేరు మీద రాయాల్సిందిగా కొడుకు రాజు, తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా భూమి విషయమై తల్లి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో భార్య లక్ష్మి సహయంతో తల్లిని గొంతు నొక్కి హత్య చేసి పరారయ్యాడు. సోమవారం ఇంటిలో నుంచి ఎవ్వరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులకు విగత జీవిగా ఎల్లవ్వ కనిపించింది. ఇంట్లో కొడుకు, కోడలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కొడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story