పైసామే పరమాత్మ.. కన్న తల్లిని కడతేర్చిన ఘనుడు!

by srinivas |
పైసామే పరమాత్మ.. కన్న తల్లిని కడతేర్చిన ఘనుడు!
X

దిశ, వెబ్‌డెస్క్ : అన్నింటికీ డబ్బే మూలం. ఎలాగైనా పైసలు సంపాదించాలి. తక్కువ సమయంలో ఎక్కువ మనీ ఎలా సంపాదించాలి. ప్రస్తుతం దీనిపైనే అందరూ ఫోకస్ పెడ్తున్నారు. కొందరు సన్మార్గంలో కాసులు సంపాదిస్తుంటే.. మరికొందరు దురాశకు పోయి నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బుల కోసం బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధీకులను సైతం వదలడం లేదు. డబ్బు మాయలో పడి కన్నవారినే కడతేర్చే స్థాయికి దిగజారుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం మిట్టపల్లెలో గురువారం సాయంకాలం వెలుగుచూసింది. ఆస్తి తన పేరు మీద రాయడం లేదని ఆగ్రహించిన కొడుకు ప్రసాద్ రెడ్డి తల్లి పుల్లమ్మను దారుణంగా కొట్టి చంపాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story