అమరావతిని శిథిలాలుగా మార్చేస్తారా?

by srinivas |
అమరావతిని శిథిలాలుగా మార్చేస్తారా?
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి విషయంలో సీఎం జగన్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడం దురదృష్టకరమన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని వచ్చారని.. అమరావతి మరో ఢిల్లీ కావాలని ఆయన ఆకాంక్షించారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

అమరావతిలో వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చేస్తారా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.

Advertisement

Next Story