- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సినేషన్.. సోమేష్ కుమార్
దిశ, మహబూబ్‌నగర్: ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరులోపు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, వైద్య, ఇతర అధికారులతో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిఎస్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ ముంచుకొస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అంతా లక్ష్య సాధన కోసం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉన్నా కేంద్రాలు, సబ్ సెంటర్లు గుర్తించాలని. అవసరమైతే సంబంధిత గ్రామాలు, పట్టణాల వార్డులోకి వెళ్లి టార్గెట్‌ను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన చోట్ల ప్యాకింగ్ మెషిన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగించాలని ఆయన సూచించారు. ఇందుకోసం వీఆర్వోలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అనుకున్న లక్ష్యాల సాధన కోసం ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి ఎటువంటి కొరత లేదని సోమేష్ కుమార్ వెల్లడించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి..
అడ్మిషన్ ప్రక్రియ కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఆరు జిల్లాల పై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మూడు జిల్లాలు ఉండడంవల్ల ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో నిర్దేశించిన 15 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 24 లక్షల డోసులను అందుబాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు టార్గెట్ ను పూర్తిచేయాలని కోరారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే హరితహారం కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర, ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా 44వ జాతీయ రహదారికి ఇరువైపుల రకరకాల పూల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ కోరారు.
- Tags
- mahabubnagar