- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండింగ్ బీటీఎస్ ‘బటర్’ సింగిల్‌కు.. పిల్లులతో కవర్ వెర్షన్
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే పాపులర్ కొరియన్ బాయ్ బ్యాండ్ ‘బీటీఎస్’.. ‘బటర్’ పేరుతో తాజాగా ఓ పాట విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ పాట మిలియన్ల మంది మదిని దోచుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో స్థానం సంపాదించుకున్న ఈ పాటను ‘పిల్లుల’తో ఓ నెటిజన్ కవర్ వెర్షన్ రూపొందించాడు. ఈ అందమైన స్పూఫ్ ఆన్‌లైన్ వైరల్‌గా నిలవగా, నెటిజన్ల మనసును దోచుకుంటోంది.
ఈ వీడియోలో పిల్లులతో పలికించిన హావభావాలు, వాటి స్టెప్స్ కొరియన్ బ్యాండ్ సభ్యులకు ఏమాత్రం తీసిపోవు. అయితే ప్రపంచ ప్రఖ్యాత కె-పాప్ ‘బీటీఎస్’ గ్రూపులో ఏడుగురు సభ్యులు( ఆర్ఎమ్, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్‌కూక్) ఉండగా, వాళ్లందరూ ‘బటర్’ పాటలో కనువిందు చేశారు. దీనికి పేరడిగా వచ్చిన ‘ఫెలైన్ వెర్షన్’లో మాత్రం ఐదు పిల్లులు(రావున్, సోల్, నోయెల్, ఇజ్, సూరి) మాత్రమే ఉన్నాయి. జంగ్‌కూక్ తన చేతిని ముద్దు పెట్టుకోవడం నుంచి ‘వి’ తన లాలిపాప్‌లోకి ఊపిరి పీల్చుకోవడం వరకు ఈ వీడియోను రీక్రియేషన్ చేసిన తీరు అద్భుతం.
అయితే ఈ వీడియో ఎవరు చేశారో తెలియలేదు కానీ.. సూరినోయెల్ అనే నెటిజన్ షేర్ చేయడంతో యూట్యూబ్‌లో క్షణాల్లోనే వైరల్ అయింది. ప్రస్తుతం లక్షలాది అభిమానులకు ఈ వీడియో నచ్చగా, బీటీఎస్ ర్యాపర్ సుగా, మిన్ యోంగిలు కూడా దీనికి ఫిదా అయ్యారు. సుగా ఎప్పుడూ తన ప్రవర్తనను పిల్లులతో తరచూ పోలుస్తుండటం తెలిసిన విషయమే. ‘ద బెస్ట్ కవర్ ఎవర్ మేడ్’, ‘ఓమైగాడ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆర్ట్’, ‘సో క్యూట్.. వాట్ ఎన్ ఐడియా’, ‘దిస్ ఈజ్ అమేజింగ్ ఐ లవ్ ఇట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బిల్‌బోర్డ్ ప్రకారం..1970లో మైఖేల్ జాక్సన్ చేసిన ఐదు సింగిల్స్ వరసగా బిల్‌బోర్డ్ 100లో స్థానం సంపాదించుకున్నాయి. అతడి తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ.. బీటీఎస్ గ్రూప్ నుంచి మొదటి నాలుగు సింగిల్స్ కూడా ఈ జాబితాలో చేరడం విశేషం. ‘డైనమైట్’, ‘లైఫ్ గోస్ ఆన్’, ‘సావేజ్ లవ్ (లాక్స్డ్ – సైరన్ బీట్)’ తర్వాత ప్రస్తుత ‘బటర్’ సింగిల్స్ హాట్ 100లో నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. ‘బిల్‌బోర్డ్‌లో బీటీఎస్ మాత్రమే ఒక్కసారికి మించి టాప్ పొజిషన్ కైవసం చేసుకుంది. మరే ఇతర బ్యాండ్ ఇప్పటివరకు ఈ ఘనత సాధించలేదు’ అని బిల్‌బోర్డ్ పేర్కొంది.