14 ఏళ్ల తర్వాత తల్లీ-కూతుళ్లను కలిపిన ఫేస్‌బుక్!

by Shyam |
mother-daughter 2
X

దిశ, ఫీచర్స్ : సమాజం, సరిహద్దులు, దేశాలు, ఖండాలుగా వేరు చేసిన ప్రపంచాన్ని ఒక్కచోట చేర్చడమే సోషల్ మీడియా పని. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాల గురించి అవగాహన కల్పించడమే కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. సోషల్ మీడియా వల్ల మంచి జరగడంతో పాటు చెడు ప్రభావం కూడా ఉంటుంది. దాన్ని తెలివిగా ఉపయోగించినట్లయితే అది ఒక వరం కావచ్చు. ఇప్పటికే తప్పిపోయిన, విడిపోయిన కుటుంబ సభ్యులెందరో సోషల్ మీడియా వేదికల ద్వారా కలుసుకోగా, ఫ్లోరిడా నుంచి 14 సంవత్సరాల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ అమ్మాయి.. ఇన్నాళ్లకు తన తల్లిని యూఎస్-మెక్సికో సరిహద్దులో ఇటీవలే కలిసింది. ఈ తల్లీకూతుళ్లను ఫేస్‌బుక్ ఒక్కటి చేసింది.

mother-daughter

జాక్వెలిన్ హెర్నాండెజ్ వయసు ప్రస్తుతం 19 ఏళ్లు కాగా, ఈ నెల ప్రారంభంలో ఫేస్‌బుక్ ద్వారా తన తల్లి ఏంజెలికా వెన్సెస్-సల్గాడోను సంప్రదించింది. ఆమె తను కోల్పోయిన కుమార్తె అని, ప్రస్తుతం మెక్సికోలో నివసిస్తున్నానని చెప్పింది. దీంతో ఈ విషయం నిజమా? కాదా అనే సందిగ్ధంతో సెప్టెంబర్ 2, 2021న, ఆమె గురించి పోలీసులు వివరించగా, సెప్టెంబర్ 10, 2021న టెక్సాస్‌లోని లారెడోలో యుఎస్‌కు ప్రవేశించే సమయంలో తనను కలవమని ఆ మహిళ కోరినట్లు వారితో చెప్పింది. ఈ నేపథ్యంలో మీటింగ్‌ని అడ్డగించడానికి, అమ్మాయి ప్రామాణికతను ధృవీకరించడానికి పోలీసులు ప్లాన్ వేశారు. ఆమె అందించిన అనేక పత్రాలను పోలీసులు పరిశీలించి, ఈ పత్రాలు అమ్మాయి వాదనలు సరైనవని తేలడంతో వెన్సెస్ తప్పిపోయిన కుమార్తె జాక్వెలిన్ ఆమెనని నిర్దారించారు. దాంతో ఈ ఇద్దరూ అధికారికంగా తాజాగా మెక్సికోలో కలుసుకున్నారు. ఫ్లోరిడాలోని క్లెర్మాంట్‌లోని తన ఇంటి నుంచే ఆరేళ్ల హెర్నాండెజ్‌ డిసెంబర్ 22, 2007లో అపహరణకు గురైందని ఆమె తండ్రి పాబ్లో పత్రికా ప్రకటనలో తెలిపారు.

‘నమ్మశక్యం కానీ ఒక భావోద్వేగ కథ. ఇప్పటికైనా సుఖాంతం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సంవత్సరాల్లో వేదనను ఊహించలేము. ఆమె కోసం చేసిన ప్రార్థనలు ఫలించాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, తల్లీ -కూతుళ్ల రీయూనియన్ తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చాలామంది తెలిపారు.

Advertisement

Next Story