హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా.. ఇందిరాశోభన్ సంచలన ప్రకటన

by Sridhar Babu |
Social activist Indira Shoban
X

దిశ, జమ్మికుంట: సమైక్య పాలనలో తీవ్రనష్టాలపాలై, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్నామని, కానీ, నేడు అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడని సామాజిక కార్యకర్త ఇందిరాశోభన్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో దగాకోరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలి పోతారని ఆమె శాపనార్థాలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, దానిని అంతమొందించేందుకు అన్ని వర్గాలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం జెండా ఏదైనా ఎజెండా ఒకటిగా అందరం కలిసి పని చేశామని, తిరిగి హక్కుల కోసం కూడా అందరం కలిసి పోరాటాలు చేయాలని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ తండ్రి, కొడుకుల జాగీరా అని ప్రశ్నించారు. దొర కోసం పనిచేసే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తనను అరెస్ట్ చేసే సమయంలో.. ‘పోవే’ అన్న సీఐపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లను హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే విధుల్లోకి తీసుకోకపోతే అందరితో నామినేషన్‌లు వేస్తానని చెప్పుకొచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లకు తీసేసే హక్కు కేసీఆర్‌కు లేదని, త్వరలోనే హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లకు కేంద్రం నుండి నిధులు వస్తాయని, వారిని తీసేసే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు.

Advertisement

Next Story