కార్ల ధరలు 3 శాతం పెంచిన స్కోడా ఆటో!

by Harish |
కార్ల ధరలు 3 శాతం పెంచిన స్కోడా ఆటో!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో భారత్‌లో తన కార్ల ధరలను పెంచనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 2022, జనవరి 1 నుంచి కంపెనీ తన అన్ని మోడళ్లపై 3 శాతం వరకు ధరలు పెంచుతామని తెలిపింది. ప్రసుతం కంపెనీ కుషాక్, కొడియాక్, ఆక్టెవియా మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులకు తోడు కార్యకలాపాల ధరలు కూడా భారంగా మారిందని, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ అన్నారు.

అయితే, సాధ్యమైనంత వరకు వినియోగదారులపై భారం అధికం కాకుండా చూసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది కాలంగా దేశంలో ఉక్కు, అల్యూమినియం, రాగి సహా విలువైన లోహాలు, ఇతర ముడి పదార్థాలు క్రమంగా పెరుగుతున్నాయి. వాహన తయారీలో కీలకమైన వీటి వ్యయం అధికంగా ఉండటంతో ఇప్పటికే పలు కంపెనీ తమ వాహనాల ధరలను పెంచాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, టయోటా, ఆడి, హోండా మోటార్ కంపెనీ వచ్చే ఏడాది నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed