సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

by Shyam |   ( Updated:2021-11-30 07:13:43.0  )
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. గత కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులను పిలిచి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వివరిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యం విషమంగా మారడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story