బెల్లంపల్లిలో మరణ మృదంగం.. కరోనాతో 12 మంది మృతి

by Aamani |
బెల్లంపల్లిలో మరణ మృదంగం.. కరోనాతో 12 మంది మృతి
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి సింగరేణి కేంద్రంలో కరోనాతో చికిత్స పొందుతూ 12 మంది ఒకే రోజు మృతి చెందారు. మృతి చెందిన వారిలో తొమ్మిది మంది 60 ఏళ్లు పైబడిన వారు కాగా, 35 ఏళ్ల వయసు దాటిన వారు ముగ్గురు ఉన్నారు . మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బెల్లంపల్లి సింగరేణి సొల్యూషన్ కేంద్రం కొవిడ్ ప్రధాన కేంద్రం కాగా, జిల్లా నలుమూలలు, అనేక మండలాల నుండి వ్యాధిగ్రస్తులను చేర్చుకొని కరోని రోగులకు నయం చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అయింది.

అయితే, సరైన సిబ్బందిని కేటాయించకపోవడంతో పాటు ఆక్సిజన్ సదుపాయం సీటీ స్కాన్ సదుపాయాలు లేని కారణంగా రోగులు మృతి చెందినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కరోనా మృతుల్లో ఆసిఫాబాద్ జిల్లా కెరామెరీ మండలానికి చెందిన ఒకరు, బెల్లంపల్లి మండలం నుండి ఇద్దరు, కడెం మండలంలోని ఒకరు, మంచిర్యాల మండలంలోని ముగ్గురు, కాగజ్ నగర్ నుండి ఒకరు, కోటపల్లి మండలంలో ఒకరు, చెన్నూరు నుండి ఒకరు, వాంకిడి మండలం నుండి ఒకరు, కాజీపేట మండలం నుండి ఒకరు ఉన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు ఐసోలేషన్ కేంద్ర డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శౌరీ తెలిపారు.

Advertisement

Next Story