సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

by Sridhar Babu |
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెంట్రల్ వర్క్ షాప్ గేటు ఎదుట సీఐటీయూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అకార‌ణంగా హౌస్ కీపింగ్‌ సింగ‌రేణి కాంట్రాక్టు కార్మికుల‌ను తొల‌గించ‌డాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ.. గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల‌ను ఎలాంటి హెచ్చ‌రిక‌లు లేకుండా డిస్మిస్ చేయ‌డం అన్యాయ‌మ‌న్నారు. పీఎఫ్, ఐడి కార్డులు, పని అనుభవం కలిగి ఉన్న వారిని విధుల నుంచి త‌ప్పించ‌డం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న‌తాధికారులు ఈ వైఖరిని మానుకోవాలని సూచించారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story