- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబాయ్‌లో సిద్దిపేట వాసి ఆత్మహత్య
దిశ, మెదక్: చేసిన అప్పులు తీర్చి, కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి, అందనంత దూరానికి వెళ్లాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నాకోడురు మండలం చంద్లపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శోభా కుమారుడు శ్రీనివాస్(25) ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. శ్రీనివాస్ తండ్రి చనిపోవడంతో తల్లి శోభా కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పెంచింది. మూడేళ్ల క్రితం కూతురు రమ్య వివాహానికి అప్పులు చేశారు. పెళ్లికి చేసిన అప్పులు తీర్చడానికి శ్రీనివాస్ దుబాయ్ వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ మూడు రోజుల క్రితం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుమారుడిని కడసారి చూడడానికి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని ప్రభుత్వాన్ని తల్లి వేడుకుంటోంది.
Tags : Siddipeta, man, commits, suicide, Dubai, medak, Debts, sister, marriage