సిద్దిపేట జిల్లాలో 29 పాజిటివ్ కేసులు

by Shyam |
సిద్దిపేట జిల్లాలో 29 పాజిటివ్ కేసులు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో గడిచిన 24 గంటల్లో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు పీహెచ్‌సీ వైద్యురాలు సరిత తెలిపారు. చిన్నకోడూరు మండలంలో 8, ఇబ్రహాంనగర్‌లో 2 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అంతేగాకుండా చందాపూర్‌ రంగనాయక సాగర్ నిర్మాణ ఏజెన్సీ మెగా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పది మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారికి కరోనా పరీక్షలు చేయగా అందులో ఆగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఆరుగురిలో ఇద్దరు ఇరిగేషన్ ఉద్యోగులు కాగా, మొత్తం మండలంలో బుధవారం వరకు 8 కరోనా కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. కాగా జిల్లాలోని రాయపోల్‌లో 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యయి. అందులో ఒకే పోలీసు స్టేషన్‌లో 6 గురు కానిస్టేబుళ్లకు కరోనా సోకటం గమనార్హం.

Advertisement

Next Story