- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటిని హింసించిన భర్త.. సీసీటీవీ ఫుటేజీ వైరల్
దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ శ్వేతా తివారి తన మాజీ భర్త అభినవ్ కోహ్లీకి మధ్య వివాదం నడుస్తోంది. గృహహింస కింద కేసు పెడతానని శ్వేత ఈ మధ్య హెచ్చరించగా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెప్పాడు అభినవ్. అయితే తాను నిందలు వేయడం లేదని, అసలు నిజమేంటో అందరూ చూడండి అంటూ తనను, తన కొడుకును హింసిస్తున్న సీసీటీవీ ఫుటేజీ రిలీజ్ చేసింది.
ఓ వీడియోలో తన నుంచి అభినవ్ బాబు(రేయాన్ష్)ను బలవంతంగా లాక్కోవడం కనిపిస్తుండగా.. మరో వీడియోలో అభినవ్‌కు భయపడి రేయాన్ష్ దాచుకునేందుకు ప్రయత్నించడం కనపడింది. ఇది ఫిజికల్ అబ్యూజ్ కాకపోతే మరేంటని ప్రశ్నించిన తివారీ.. నిజాలు ప్రపంచానికి చూపెట్టేందుకే ఈ వీడియో షేర్ చేశానని చెప్పింది. ఈ ఘటన తర్వాత దాదాపు నెలరోజుల పాటు తన కొడుకు నిద్రకూడా పోలేదని, ఇప్పటికీ తన తండ్రి అంటే భయపడుతున్నాడని తెలిపింది. అయితే తన బాబు మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేదని.. ప్రశాంతంగా, సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించింది. కాగా ఈ వీడియో చూసిన తోటి నటీనటులు తనకు సపోర్ట్ చేయగా.. నిర్మాత ఏక్తా కపూర్ అభినవ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.