డబుల్ సెంచరీతో మెరిసిన శుభ్‌మన్‌ గిల్.. టీమిండియా భారీ స్కోర్

by Vinod kumar |   ( Updated:2023-01-18 13:10:53.0  )
డబుల్ సెంచరీతో మెరిసిన శుభ్‌మన్‌ గిల్.. టీమిండియా భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీయిత ఓవర్లులో 8 వికెట్లు కోల్సోయి 349 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మరోసారి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. 87 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరు అందుకున్నాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో శుభ్‌మన్‌కి ఇది తొలి ద్విశతకం. రోహిత్ శర్మ 38 బాల్స్‌లో 34 పరుగులు చేసి.. ఔట్ అయ్యాడు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌, షిప్లే చెరో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్‌, టిక్నర్‌, శాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Next Story