NBK#107.. బాలయ్య సరసన రొమాన్స్‌కు శృతిహాసన్ రెడీ

by Jakkula Samataha |   ( Updated:2021-11-05 03:34:48.0  )
NBK#107.. బాలయ్య సరసన రొమాన్స్‌కు శృతిహాసన్ రెడీ
X

దిశ, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ట 107వ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నిజ జీవిత ఘటనల ఆధారంగా బాలయ్య స్టైల్‌లో మాస్, కమర్షియల్ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌ ఎవరనేదానిపై ఆసక్తి నెలకొనగా.. శృతి హాసన్‌ను ఖరారు చేస్తూ, ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్ర బృందం దీపావళి రోజున ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

బాలకృష్ణతో శృతికి ఫస్ట్ మూవీ కాగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఆమెకు ఇది మూడవ చిత్రం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరు కలిసి చేసిన ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బాలకృష్ట సినిమాలతో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫాంపై యాంకర్ గాను ప్రేక్షకులను అకట్టుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.

ఇద్దరితో ఒకేసారి రొమాన్స్ చేస్తున్న అక్కినేని హీరో?

Advertisement

Next Story