డేటింగ్‌పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shyam |
డేటింగ్‌పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ శ్రుతి హాసన్.. శంతను హజారికాతో రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయింది. మందిరా బేడీ టాక్ షో ‘ది లవ్ లాఫ్ లివ్’లో.. డేటింగ్ గురించి మాట్లాడింది. గతంలో తన రిలేషన్ గురించి రహస్యంగా ఉంచాలనుకునేదని అమ్మడు చెప్పుకొచ్చింది. కానీ ఇది మన పార్ట్‌నర్‌ను అవమానపరచడంగా తాను అభిప్రాయపడ్డానని తెలిపింది. గతంలో సింగిల్‌గా ఉన్నానని చెప్పేందుకు ఇష్టపడేదాన్నని, మన చుట్టూ ఉన్న వారు కూడా అదే కోరుకుంటారని తెలిపింది.

చాలామంది ‘కచ్చితంగా సింగిల్‌గా కనిపించాలి, వారికి అందుబాటులో ఉండాలి’ అనే అభిప్రాయంతో ఉంటారని.. కానీ తర్వాత ఎవరి కోసమో పార్ట్‌నర్‌ను బాధపెట్టడం ఎందుకని అనిపించిందని చెప్పింది. ఈ రిలేషన్ వర్కౌట్ కావచ్చు, కాకపోవచ్చు కానీ మనం మన ఎన్విరాన్మెంట్‌కు, అందులో ఉన్న వ్యక్తులకు రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని తెలిపింది.

Advertisement

Next Story