తెలంగాణకు మొదటి శ్రామిక్ రైలు

by Shyam |
తెలంగాణకు మొదటి శ్రామిక్ రైలు
X

దిశ, కరీంనగర్:
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను శ్రామిక్ రైలు ద్వారా కేంద్ర ప్రభుత్వం వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది.ఈ క్రమంలోనే శనివారం మొదటి సారిగా ముంబాయి నుంచి వలస కూలీలతో శ్రామిక్ ట్రైన్ తెలంగాణాలో అడుగుపెట్టింది. సుమారు 1,725 మంది కూలీలు ఈ రైలు ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోని రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారి వారి ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యక బస్సులను ఏర్పాటు చేశారు.ముందుగా కూలీలకు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు. సాధారణ కూలీలను స్వస్థలాలకు పంపించారు. వైద్య బృందాలతో పాటు పోలీసులు కూడా స్టేషన్ల వద్ద ఉండి వారి వివరాలు సేకరించారు. ముంబాయి నుంచి వచ్చిన వారిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 17మంది, భద్రాద్రికి ఒకరు, హైదాబాద్‌కు 47, జగిత్యాల 842, జనగాం 21, జోగులాంబ గద్వాల్ ముగ్గురు, కామారెడ్డి, 51, కరీంనగర్ 83, మహబూబ్ నగర్ 8, మంచిర్యాల 32, నల్గొవడ 14, నారాయణ్ పేట ఒకరు, నిర్మల్ 28, నిజామాబాద్ 404, పెద్దపల్లి 4, సిరిసిల్ల 66, రంగారెడ్డి ఒకరు, సిద్దిపేట 25, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 24, యాదాద్రి 22, మహబూబాబాద్ ముగ్గురు, మెదక్ జిల్లాకు 12 మంది వచ్చారని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story