- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి కొడాలి నానికి షాక్.. నోటీసులు అందించిన ఎస్ఈసీ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. శుక్రవారం మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు ఇస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు అందించింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోగా వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం ఉదయం మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికీ రేషన్‌పై కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టీడీపీ కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే రేషన్ వాహనాలు నిలిపివేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. చంద్రబాబు ఎస్ఈసీని తిట్టడం ఒక డ్రామా అని కొడాలి నాని విమర్శించారు.