బ్లాక్ ఫంగస్‌కు మందుల కొరత

by Shyam |
బ్లాక్ ఫంగస్‌కు మందుల కొరత
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సలకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బి మందుల కొరత తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా చికిత్సలందిస్తున్న కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో కేవలం 100 మందికి పేషెంట్లకు సరిపడా మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్క పేషెంట్‌కు 21వాయిల్స్ ఇంజక్షన్లు అవసరంకానున్నాయి. వీటితో పాటు చెవి, ముక్కు, గొంతులో తగిన సర్జరీలు చేయాల్సి ఉంటుంది. పేషెంట్ల సంఖ్య పెరిగితే ఇంజక్షన్‌లకు, సర్జరీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మందుస్తు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ప్రాణనష్టంవాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. బ్లాక్ ఫంగస్ వ్యాధికి ఆయుర్వేదం ద్వారా ప్రాణనష్టం లేకుండా చికిత్సలు అందించవచ్చిన ఆయుశ్ డాక్టర్లు ప్రకటిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ మొదట్లో ప్రభుత్వం ఏ విధమైన నిర్లక్ష్యం వ్యవహరించిందో అదే నిర్లక్ష్యాన్ని బ్లాక్ ఫంగస్ విషయంలోనూ అవలంభిస్తుంది. వ్యాధి తీవ్రత పెరుగుతుందని సంకేతాలున్నప్పట్టికి మందుస్తుగా మందులను, ఇంజక్షలను, సరిపడా బెడ్లను ఏర్పాటు చేయడంలో పూర్తిగా అలసత్వం వహించారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ విషయంలో కూడా ప్రభుత్వం అదే విధమైన దోరణి అవలంభిస్తుంది. మొదట బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి కాదని, అంటు వ్యాధి అసలే కాదని ప్రకటనలు చేసి అంత సీరియస్ గా తీసుకోలేదు, బ్లాక్ ఫంగస్ తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం అంటు వ్యాధుల జాబితాలోకి చేరుస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నప్పటికి అవసరమైన మందులను, ఇంజక్షన్లను ప్రభుత్వం ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు.

100 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లు

బ్లాక్ ఫంగస్ మరణాలు సంభవించడంతో ప్రభుత్వం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిని ప్రత్యేక చికిత్సల కోసం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడంతో వీరిలో 50 మంది వరకు ప్రైవేటులో చికిత్సలు పొందుతుండగా 50 మంది బ్లాక్ ఫంగస్ పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. పేషెంట్లకు శరీరంలోని మ్యూకర్మైకోసిస్ ఫంగస్‌ను ను నియంత్రించేందుకు ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను, చెవి, ముక్కు, గొంతు సర్జరీలను చేయాల్సి ఉంటుంది.

తీవ్రమైన మందుల కొరత

కరోనా నుంచి కోలుకున్న చాలా మందిలో బ్లాక్ ఫంగస్ వ్యాధి ఉత్పన్నమవుతుంది. వీరిలో ప్రభుత్వం అధికారికంగా 100 మాత్రమే గుర్తిచినప్పట్టి వెలుగులోకి రాని కేసులు చాలా వరకు ఉన్నాయి. రోజురోజకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు సరిపడా చికిత్సలను అందించేందుకు ప్రభుత్వం విఫలమవుతుంది. ఒక బ్లాక్ ఫంగస్ పేషెంట్‌కు 21 వాయిల్స్ ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 100 మంది పేషెంట్లకు సరిపడా ఇంజక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సర్జరీలు చేసేందుకు సరిపడా డాక్టర్లు లేకపోవడంతో పేషెంట్ల తాకిడి ఎక్కవైతే అధిక సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేద మందులు

బ్లాక్ ఫంగస్ వ్యాధికి ప్రాణనష్టం లేకుండా ఆయర్వేదం ద్వారా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి వివరించారు. రెండు విధానాల ద్వారా ఆయుర్వేద మందులను వినియోగించి బ్లాక్ ఫంగస్ ను నియంత్రిచ వచ్చిన తెలిపారు. మొదటి విధానంలో గంధక రసాయణం- 500 మిల్లీగ్రాములు రోజుకు మూడుసార్లు భోజనం తర్వాత వేసుకోవాలన్నారు. వొకిషాదివటి -250 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు భోజనానికి ముందువేసుకోవాలని చెప్పారు. వసంత కుసుమాకర రస్‌- 125 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు తీసుకోవాలన్నారు. శుభ్ర భస్మ- 500 మిల్లీగ్రాముల చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకొని పుక్కిలించాలని సూచించారు. రెండవ విధానంలో నారదీయ లక్ష్మీ విలాసరస్‌- 500 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత తీసుకోవాలని, కైషోర గుగ్గులు- రోజుకు మూడుసార్లు భోజనం తర్వాత 500 మిల్లీగ్రాంలు తీసుకోవాలని వివరించారు. సుదర్శన ఘన వటి- 500 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలని చెప్పారు. నిషా ఆమ్లకి- 500 మిల్లీగ్రాములు రోజుకు మూడుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలని సూచించారు. ఈ మందులన్ని ఆయుర్వేదం మందులు షాపులో అందుబాటులో

Advertisement

Next Story