- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఇక ఫుల్ డే ఓపెన్
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్ కట్టుబాట్లు నెమ్మదిగా సడలుతున్నాయి. కంటోన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలో షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసుకోవచ్చని సడలింపునిచ్చింది. ఆ తరువాత మధ్యాహ్నం 1 గంట వరకు తెరుచుకోవచ్చని తెలిపింది.
తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తూ, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చని తెలిపింది. పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లను మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరవాలని సూచించింది. గ్రామాల్లో షాపులు, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న షాపులు, అతి తక్కువ పాజిటివ్ కేసులు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చింది.
అయితే కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను షాపు యజమానులు, కొనుగోలుదారులు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. అలాగే సామాజిక దూరం పాటించాల్సిందేనని తెలిపింది. తెరవాలనుకునే దుకాణాల వద్ద శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.