- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు షాక్… కష్టాన్ని అందరం పంచుకోవాలి : కేసీఆర్
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యారు. లాక్‌డౌన్ విధించడంతో ప్రభుత్వానికి రెవెన్యూ లేకుండా దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యేల జీతాల కూడా కోత పెట్టాల్సి వస్తుందేమో, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాల్సిందే అని చెప్పారు. అధికారులతో పాటు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగిలినట్టయింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకమైన ఎక్సైజ్ శాఖ మందగమనంలో సాగుతున్న ఈ క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ‘లాక్ డౌన్ పెద్ద లాస్. మొదటికే మోసం వచ్చేలా ఉంది. తెలంగాణకు కేంద్రం నుంచి రూ.12వేల కోట్లు రావాలి. మార్చి 15 నుంచి ఎక్సైజ్, పెట్రోల్, జీఎస్టీ అన్ని బంద్ అయ్యాయి. ఎమ్మెల్యేల జీతాల కూడా బంద్ పెట్టాల్సి వస్తుందేమో. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కోత విధించాల్సి వస్తే విధించాల్సిందే.’ అని అన్నారు.
ఈ సందర్భంగా ‘ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్రంలో భాగం కాదా? కష్టం వస్తే అందరమూ పంచుకోవాలి కదా? ఇది లగ్జరీ పీరియడ్ కాదు. మనం ఇబ్బందుల్లో ఉన్నాము. విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి కదా. కొన్ని రోజులు చూసుకుని నడవాలి కదా. అందరూ తగ్గించుకోవాలి. తప్పదు కదా. గండం గట్టెక్కే వరకు అందరం ఊపిరి బిగపెట్టుకుని కాంప్రమైజ్ కావాలి. కరువు వచ్చినప్పుడు ఉన్నంతలో అందరం తింటాం. ఇది కూడా అంతే’ అని కేసీఆర్ అన్నారు. అయితే, రైతులు, సామాన్యుల దగ్గరీ నుంచి అందరి ఆర్థిక స్థితిపై అవగాహన ఉన్న కేసీఆర్. ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో వారి జీతాల్లో కోత పెట్టబోరని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
Tags : Shocking News, Government Employees, CM KCR, Pressmit, Lockdown